Wednesday, December 6, 2006

వలపు విరిసిన (ఆత్మ గౌరవం)

పల్లవి
వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే
మనసులు కలసిన చూపులె పులకించి పాడెలే
వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే

చరనం 1
బరువు కనుల నను చూడకు మరులు గొలిపి మది రేపకు
బరువు కనుల నను చూడకు మరులు గొలిపి మది రేపకు
చెలి తలపే తెలిపెనులే సిగలోనిలే మల్లెలు

చరనం 2
ఉరిమిన జడిసే నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి
ఉరిమిన జడిసే నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి
నీ హృఉదయములో వొదిగినచో బెదురింక యేమ్మునది

చరనం 3
తొలకరి చినుకుల చిటపటలు చలి చలి గాలుల గుస గుసలు
తొలకరి చినుకుల చిటపటలు చలి చలి గాలుల గుస గుసలు
పెదవులపై మధురిమలే చిలికించ మన్నాయిలే

వాడిన పూలే (మాంగల్య భలం)

పల్లవి
వాడిన పూలే వికసించెనే
వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హ్రుదాయలు పులకించెనే

తీయని కలలే ఫలియించెనే
తీయని కలలే ఫలియించెనే
యెల కొయిల తన గొంతు సవరించెనే||

చరణం 1
వేయిరేకులు విరిసింది జలజం
తీయ తేనియ కొసరింది భ్రమరం
లోకమే ఒక వుద్యానవనము
లోటు లేదిక మనదే సుఖము ||

చరణం 2
పగలే జాబిలి ఉదయించెనేల
వగలే చాలును పరిహాసమేల
తేట నీటను నీ నవ్వు మొగమే
తేలియడెను నెల రేని వలెనే||

చరణం 3
జీవితాలకు నేడే వసంతం
చేదిరిపోవని ప్రేమానుబంధం
ఆలపించిన ఆనంద గీతం
ఆలకింపగ మధురం మధురం ||

వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృఉదయాలు పులకించెనే

తెలియని ఆనందం(మాంగల్య భలం)

పల్లవి
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పరవశమై పాడే నా హృఉదయం

చరణం 1
కల కలలాడెను వసంత వనము
మైమరపించెను మలయా నిలము
తీయని ఊహల ఊయలలూగి తేలే మానసము
ఏమో తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

చరణం 2
రోజు పూచే రోజా పూలు వొలికించినవి నవరాగాలు
పరిచయమైన కొయిల పాటే కురిసే అనురాగం
ఏమో తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

చరణం 3
అరుణ కిరణముల గిలిగింతలలో కరగిన తెలి మంచు తెరలే తరలి
యెరుగని వింతలు యదుటే నిలిచి వెలుగే వికసించే
ఏమో తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

పెనుచీకటాయే (మాంగల్య భలం)

పల్లవి
పెనుచీకటాయే లోకం చెలరేగే నాలో సోకం
విషమయే మా ప్రేమ విధియే పగాయె

చరణం 1
చిననాటి పరిణయగాధ ఎదిరించలేనైతినే
ఈనాటి ప్రేమగాధ తలదాల్చలేనైతినే
కలలే నసించిపోయే మనసే కృఉసించిపోయే
విషమయే మా ప్రేమ విధియే పగాయె

చరణం 2
మొగమైన చూపలేదే మనసింతలొ మారెనా
నా ప్రాణ సతివని తెలిపే అవకాశమే పోయెనా
తొలినాటి కలతల వలన హృఉదయాలు బలికావలెనా
విషమయే మా ప్రేమ విధియే పగాయె

ఓ రంగయో (వెలుగు ణీదలు)

పల్లవి
ఓ రంగయో పూలరంగయో
ఓరచూపు చాలించి సాగిపోవయో
పొద్దు వాలిపోతున్నదోయి
ఇంత మొద్దు నడక నీ కేందుకోయి

చరణం 1
పగలనక రేయనక పడుతున్న శ్రమనంతా
పరులకొరకు ధారపోయు మూగజీవులు
ఆటలలో పాటలలో ఆయాసం మరచిపోయి
ఆనందం పొందగలుగు ధన్యజీవులు

చరణం 2
కడుపారగ కూడులేని తలదాచగ గూడులేని
ఈ దీనుల జీవితాలు మారుటెన్నడో
కలవారలు లేనివారి కష్టాలను తీర్చుదారి
కనిపెట్టి మేలు చేయ గలిగినప్పుడే

ఓ రంగయో పూల రంగయో
ఓర చూపు చాలించి సాగిపొవయో
పొద్దువాలిపోతున్నదోయి
ఇంత మొద్దునడక నీకెందుకోయి ||ఓ రంగయో||

నందుని చరితము (జయభెరి)

పల్లవి
నందుని చరితము వినుమా
పరమానందము గనుమా
పరమానందము గనుమా

చరనం 1
ఆదనూరు లో మాలవాడలో
ఆదనూరు లో మాలవాడలో
పేదవాడుగ జనియించీ
పెతంబరేషుని పదాంబుజములే
మదిలొ నిలిపి కొలిచేను

చరనం 2
తన యజమానుని ఆనతి వీడెను
శివుని చూడగ మనసుపడి
తన యజమానుని ఆనతి వీడెను
శివుని చూడగ మనసుపడి
పొలాల చెద్యము ముగించి రమ్మని
పొలాల చెద్యము ముగించి రమ్మని
గడువే విధించే యజమాని
యజమాని ఆనతిచ్చిన గడువులో
ఏ రీతి పొలము పండించుటో యెరుగక
అలమటించు తన భక్తుని కార్యము
ఆ శివుడే నెరవేర్చే
పరుగున పోయెను చిదంబరానికి
భక్తుడు నందుడు ఆత్రమున
పరుగున పోయెను చిదంబరానికి
భక్తుడు నందుడు ఆత్రమున
చిదంబరంలో శివుని దర్శనం చెయ్యగరాదనే పూజారి
ఆశ భంగము పొందిన నందుడు ఆ గుడి ముందె మూర్చిల్లే
అంతట శివుడే అతనిని బ్రోచి పరం జ్యోథి గా వెలయించే

నేను సైతం (టాగూర్‌)

పల్లవి
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వ్రుష్టికి అశృఉవొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మొసానూ

చరణం1
అగ్నినేత్ర ఉగ్ర జ్వాళ దాచినా ఓ రుదృఉడా
అగ్ని శిఖలను గుండెలోన అణచినా ఓ సూర్యుడా
పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవా
హింసనణచగ ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా
మన్న్యెం వీరుడు రామరాజు ధనుష్టం కారాసివా
భగత్‌ సింఘ్‌ కడ సారి పలికిన ఇంక్విలాబ్‌ శబ్దానివా

చరణం2
అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
చమురు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్ష్లాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా