Wednesday, December 6, 2006

వాడిన పూలే (మాంగల్య భలం)

పల్లవి
వాడిన పూలే వికసించెనే
వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హ్రుదాయలు పులకించెనే

తీయని కలలే ఫలియించెనే
తీయని కలలే ఫలియించెనే
యెల కొయిల తన గొంతు సవరించెనే||

చరణం 1
వేయిరేకులు విరిసింది జలజం
తీయ తేనియ కొసరింది భ్రమరం
లోకమే ఒక వుద్యానవనము
లోటు లేదిక మనదే సుఖము ||

చరణం 2
పగలే జాబిలి ఉదయించెనేల
వగలే చాలును పరిహాసమేల
తేట నీటను నీ నవ్వు మొగమే
తేలియడెను నెల రేని వలెనే||

చరణం 3
జీవితాలకు నేడే వసంతం
చేదిరిపోవని ప్రేమానుబంధం
ఆలపించిన ఆనంద గీతం
ఆలకింపగ మధురం మధురం ||

వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృఉదయాలు పులకించెనే

No comments: