Wednesday, December 6, 2006

నందుని చరితము (జయభెరి)

పల్లవి
నందుని చరితము వినుమా
పరమానందము గనుమా
పరమానందము గనుమా

చరనం 1
ఆదనూరు లో మాలవాడలో
ఆదనూరు లో మాలవాడలో
పేదవాడుగ జనియించీ
పెతంబరేషుని పదాంబుజములే
మదిలొ నిలిపి కొలిచేను

చరనం 2
తన యజమానుని ఆనతి వీడెను
శివుని చూడగ మనసుపడి
తన యజమానుని ఆనతి వీడెను
శివుని చూడగ మనసుపడి
పొలాల చెద్యము ముగించి రమ్మని
పొలాల చెద్యము ముగించి రమ్మని
గడువే విధించే యజమాని
యజమాని ఆనతిచ్చిన గడువులో
ఏ రీతి పొలము పండించుటో యెరుగక
అలమటించు తన భక్తుని కార్యము
ఆ శివుడే నెరవేర్చే
పరుగున పోయెను చిదంబరానికి
భక్తుడు నందుడు ఆత్రమున
పరుగున పోయెను చిదంబరానికి
భక్తుడు నందుడు ఆత్రమున
చిదంబరంలో శివుని దర్శనం చెయ్యగరాదనే పూజారి
ఆశ భంగము పొందిన నందుడు ఆ గుడి ముందె మూర్చిల్లే
అంతట శివుడే అతనిని బ్రోచి పరం జ్యోథి గా వెలయించే

No comments: