Wednesday, December 6, 2006

భూతాన్ని,
యజ్నోపవీతాన్ని,
వైప్లవ్యగీతాన్ని నెను!

స్మరిస్తే పద్యమ్,
అరిస్తే వాద్యమ్,
అనల వేదికమున్దు అస్ర నైవేద్యమ్!

లోకాలు,
భవభూతి శ్లోకాలు,
పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు!

నా ఊహ ఛామ్పేయమాల!
రస రాజ్యడోల!
నా ఊళ కేదార గౌళ!

గిరులు,
సాగరులు, కన్కేలికా మఞరులు,
ఝరులు నా సోదరులు!

నేనొక దుర్గమ్!
నాదొక స్వర్గమ్!
అనర్గళమ్, అనితర సాద్యమ్, నా మార్గమ్!

1 comment:

Unknown said...

వీటిలో ఉన్న పదాలకు అర్థాలు ఎలా తెలుసుకోవచ్చు..?