Wednesday, December 6, 2006

ఎవరో వస్తారని (భూమికోసం)

పల్లవి:
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజము మరచి నిదురపోకుమా

చరణం1:
బడులేలేని పల్లెటూళ్ళలో
బడులేలేని పల్లెటూళ్ళలో చదువేరాని పిల్లలకు
చవుడు రాలే చదువుల బడిలో
జీతాల్రాని పంతుళ్ళకూ

చరణం2:
చాలీ చాలని పూరిగుడిసెలో
చాలీ చాలని పూరిగుడిసెలో కాలేకడుపుల పేదలకు
మందులులేని ఆసుపత్రిలో
పడిగాపులు పడు రోగులకు

చరణం3:
తరతరాలుగా మూఢాచారపు
వలలో చిక్కిన వనితలకు
అజ్ఞానానికి అన్యాయానికి
బలియైపోయిన పడతులకు

చరణం4:
కూలిడబ్బుతో లాటరీ టికెట్‌ లాటరీ టికెట్‌
కూలిడబ్బుతో లాటరీ టికెట్‌ కొనే దురాశా జీవులకు
దురలవాట్లతో బాధ్యత మరచి
చెడే నిరాశా జీవులకు

చరణం5:
సేద్యంలేని బీడునేలలో
పనులే లెని ప్రాణులకు
పగలూ రేయీ శ్రమపడుతున్నా
ఫలితం దక్కని దీనులకు

No comments: