Wednesday, December 6, 2006

వలపు విరిసిన (ఆత్మ గౌరవం)

పల్లవి
వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే
మనసులు కలసిన చూపులె పులకించి పాడెలే
వలపులు విరిసిన పూవ్వులె కురిపించె తేనియలే

చరనం 1
బరువు కనుల నను చూడకు మరులు గొలిపి మది రేపకు
బరువు కనుల నను చూడకు మరులు గొలిపి మది రేపకు
చెలి తలపే తెలిపెనులే సిగలోనిలే మల్లెలు

చరనం 2
ఉరిమిన జడిసే నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి
ఉరిమిన జడిసే నెచ్చెలి అడుగక ఇచ్చెను కౌగిలి
నీ హృఉదయములో వొదిగినచో బెదురింక యేమ్మునది

చరనం 3
తొలకరి చినుకుల చిటపటలు చలి చలి గాలుల గుస గుసలు
తొలకరి చినుకుల చిటపటలు చలి చలి గాలుల గుస గుసలు
పెదవులపై మధురిమలే చిలికించ మన్నాయిలే

వాడిన పూలే (మాంగల్య భలం)

పల్లవి
వాడిన పూలే వికసించెనే
వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హ్రుదాయలు పులకించెనే

తీయని కలలే ఫలియించెనే
తీయని కలలే ఫలియించెనే
యెల కొయిల తన గొంతు సవరించెనే||

చరణం 1
వేయిరేకులు విరిసింది జలజం
తీయ తేనియ కొసరింది భ్రమరం
లోకమే ఒక వుద్యానవనము
లోటు లేదిక మనదే సుఖము ||

చరణం 2
పగలే జాబిలి ఉదయించెనేల
వగలే చాలును పరిహాసమేల
తేట నీటను నీ నవ్వు మొగమే
తేలియడెను నెల రేని వలెనే||

చరణం 3
జీవితాలకు నేడే వసంతం
చేదిరిపోవని ప్రేమానుబంధం
ఆలపించిన ఆనంద గీతం
ఆలకింపగ మధురం మధురం ||

వాడిన పూలే వికసించెనే
చెర వీడిన హృఉదయాలు పులకించెనే

తెలియని ఆనందం(మాంగల్య భలం)

పల్లవి
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పరవశమై పాడే నా హృఉదయం

చరణం 1
కల కలలాడెను వసంత వనము
మైమరపించెను మలయా నిలము
తీయని ఊహల ఊయలలూగి తేలే మానసము
ఏమో తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

చరణం 2
రోజు పూచే రోజా పూలు వొలికించినవి నవరాగాలు
పరిచయమైన కొయిల పాటే కురిసే అనురాగం
ఏమో తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

చరణం 3
అరుణ కిరణముల గిలిగింతలలో కరగిన తెలి మంచు తెరలే తరలి
యెరుగని వింతలు యదుటే నిలిచి వెలుగే వికసించే
ఏమో తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

పెనుచీకటాయే (మాంగల్య భలం)

పల్లవి
పెనుచీకటాయే లోకం చెలరేగే నాలో సోకం
విషమయే మా ప్రేమ విధియే పగాయె

చరణం 1
చిననాటి పరిణయగాధ ఎదిరించలేనైతినే
ఈనాటి ప్రేమగాధ తలదాల్చలేనైతినే
కలలే నసించిపోయే మనసే కృఉసించిపోయే
విషమయే మా ప్రేమ విధియే పగాయె

చరణం 2
మొగమైన చూపలేదే మనసింతలొ మారెనా
నా ప్రాణ సతివని తెలిపే అవకాశమే పోయెనా
తొలినాటి కలతల వలన హృఉదయాలు బలికావలెనా
విషమయే మా ప్రేమ విధియే పగాయె

ఓ రంగయో (వెలుగు ణీదలు)

పల్లవి
ఓ రంగయో పూలరంగయో
ఓరచూపు చాలించి సాగిపోవయో
పొద్దు వాలిపోతున్నదోయి
ఇంత మొద్దు నడక నీ కేందుకోయి

చరణం 1
పగలనక రేయనక పడుతున్న శ్రమనంతా
పరులకొరకు ధారపోయు మూగజీవులు
ఆటలలో పాటలలో ఆయాసం మరచిపోయి
ఆనందం పొందగలుగు ధన్యజీవులు

చరణం 2
కడుపారగ కూడులేని తలదాచగ గూడులేని
ఈ దీనుల జీవితాలు మారుటెన్నడో
కలవారలు లేనివారి కష్టాలను తీర్చుదారి
కనిపెట్టి మేలు చేయ గలిగినప్పుడే

ఓ రంగయో పూల రంగయో
ఓర చూపు చాలించి సాగిపొవయో
పొద్దువాలిపోతున్నదోయి
ఇంత మొద్దునడక నీకెందుకోయి ||ఓ రంగయో||

నందుని చరితము (జయభెరి)

పల్లవి
నందుని చరితము వినుమా
పరమానందము గనుమా
పరమానందము గనుమా

చరనం 1
ఆదనూరు లో మాలవాడలో
ఆదనూరు లో మాలవాడలో
పేదవాడుగ జనియించీ
పెతంబరేషుని పదాంబుజములే
మదిలొ నిలిపి కొలిచేను

చరనం 2
తన యజమానుని ఆనతి వీడెను
శివుని చూడగ మనసుపడి
తన యజమానుని ఆనతి వీడెను
శివుని చూడగ మనసుపడి
పొలాల చెద్యము ముగించి రమ్మని
పొలాల చెద్యము ముగించి రమ్మని
గడువే విధించే యజమాని
యజమాని ఆనతిచ్చిన గడువులో
ఏ రీతి పొలము పండించుటో యెరుగక
అలమటించు తన భక్తుని కార్యము
ఆ శివుడే నెరవేర్చే
పరుగున పోయెను చిదంబరానికి
భక్తుడు నందుడు ఆత్రమున
పరుగున పోయెను చిదంబరానికి
భక్తుడు నందుడు ఆత్రమున
చిదంబరంలో శివుని దర్శనం చెయ్యగరాదనే పూజారి
ఆశ భంగము పొందిన నందుడు ఆ గుడి ముందె మూర్చిల్లే
అంతట శివుడే అతనిని బ్రోచి పరం జ్యోథి గా వెలయించే

నేను సైతం (టాగూర్‌)

పల్లవి
నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను
నేను సైతం విశ్వ వ్రుష్టికి అశృఉవొక్కటి ధారవోసాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక పిచ్చి మొసానూ

చరణం1
అగ్నినేత్ర ఉగ్ర జ్వాళ దాచినా ఓ రుదృఉడా
అగ్ని శిఖలను గుండెలోన అణచినా ఓ సూర్యుడా
పరశ్వధమును చేతబూనిన పరశురాముని అంశవా
హింసనణచగ ధ్వంస రచనలు చేసిన ఆచార్యుడా
మన్న్యెం వీరుడు రామరాజు ధనుష్టం కారాసివా
భగత్‌ సింఘ్‌ కడ సారి పలికిన ఇంక్విలాబ్‌ శబ్దానివా

చరణం2
అక్రమాలను కాలరాసిన ఉక్కు పాదం నీదిరా
లంచగొండుల గుండెలో నిదురించు సింహం నీవురా
ధర్మదేవత నీడలో పయనించు యాత్రే నీదిరా
చమురు కప్పిన న్యాయదేవత కంటి చూపైనావురా
సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా
లక్ష్లాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా

ఆరాధన (నా హృదయంలో నిదురించే)

నా హ్రుదయంలొ నిదురించె చెలి
కల్లలలోనె కవ్వించే సఖి
మయూరివై వయారివై నెడె
నటనమాడి నీవే
నన్ను దోచ్చి నావే

నా హ్రుదయంలొ

నీ కన్నులలోన దాగేనులే వేన్నేలసోన
కన్నులలోన దాగేనులే వేన్నేలసోన
చకోరమై నిన్ను వరించి అనుసరించినానే కలవరించినానే

నా హ్రుదయంలొ

నా గానములొ నీవే ప్రానముగ పులకరించినావె
ప్రానముగ పులకరించినావె
పల్లవిగ పలుకరించరావే
పల్లవిగ పలుకరించరావే
నీ వేచ్చని నీడ వేలసెను నా వలపుల మేడ
వెచ్చని నీడ వేలసెను నా వలపుల మేడ
నివాలితో చేయిసాచి యెదురు చూచినానే నిదుర కాచినానే

నా హ్రుదయంలొ

డాక్టర్‌ చక్రవర్తి (మనసున మనసై)

మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
మనసున మనసై
బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే బాగ్యము అదే స్వర్గము

ఆశలు తీరని ఆవేశములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన అదే బాగ్యము అదే స్వర్గము

నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన్న అదే బాగ్యము అదే స్వర్గము

చేలిమియే కరువై వలపే అరుదై
చేదరిన హ్రుదయమే సిల ఐ పోగ
నీ వ్యధ తేలిసి నీడగ నిలిచి

తోడొకరుండిన అదే బాగ్యము అదే స్వర్గము

మనసున||

వెలుగు నీడలు (కల కానిది)

కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనె బలి చేయకు
కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనె బలి చేయకు

గాలి వీచి పూవుల తీగ నేల వాలి పోగ
గాలి వీచి పూవుల తీగ నేల వాలి పోగ
జాలి వీడి అటులేగాని వదులవైతువా
చేర దీసి నీరు పోసి చిగురించ నీయవా

కల కానిది||

అలముకున్న చీకటిలోనె అలమటించనేల
అలముకున్న చీకటిలోనె అలమటించనేల
కలతలకే లొంగి పోయి కలువరించనేల
సాహసమను జ్యొతిని చేకొని సాగిపో

కల కానిది||

అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
సోకాల మరుగున దాగి శుఖమున్నదిలే
అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
సోకాల మరుగున దాగి శుఖమున్నదిలే
ఏది తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీర గుణం

కల కానిది||

భార్య భర్తలు (జోరుగా హుషారుగా)

జోరుగ హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయ తీయ్యగా
జోరుగ హుషారుగా షికారు పోదమా హాయి హాయిగా తీయ తీయ్యగా జోరుగ

ఓ బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినె చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే
ఓ బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినె చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే
మరువనంటినే మరువనంటినే ఒ.....

జోరుగ||

నీ వన్నె చిన్నెలన్ని చూసి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే
వన్నె చిన్నెలన్ని చూసి వలచినాడనే
వయసు సొగసు తలచి తలచి మురిసినాడనే
కలిసిరాగదే కలిసిరాగదే ఒ.....

జోరుగ||

నా కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే కనులు తెరిచి నిన్ను నేనె కాంచినాడనే
నా కలలలోన చెలియ నిన్నె పిలిచినాడనే కనులు తెరిచి నిన్ను నేనె కాంచినాడనే
వరించినాడనే వరించినాడనే ఒ.....

జోరుగ||

హాయి హాయిగ జాబిల్లి (వెలుగు నీడలు)

పల్లవి
హాయి హాయిగ జాబిల్లి
తొలిరేయి వెండి దారాలల్లి
మందుజల్లి నవ్వసాగే ఎందుకో
మత్తుమందుజల్లి నవ్వసాగే ఎందుకో

చరణం1
తళతళ మెరిసిన తారక తెలి వెలుగుల వెన్నెల దారుల
తళతళ మెరిసిన తారక తెలి వెలుగుల వెన్నెల దారుల
కోరి పిలిచెను తన దరి చేరగా
మది తలచెను తీయని కోరిక

చరణం2
మిలమిల వెలిగే నీటిలో చెలి కలువలరాణీ చూపులో
మిలమిల వెలిగే నీటిలో చెలి కలువలరాణీ చూపులో
సుమ దళములు పూచిన తోటలో
తొలి వలపుల తేనెలు దాగెను

చరణం3
విరిసిన హృఉదయమే వీణగా మధు రసములు కొసరిన వేళలా
విరిసిన హృఉదయమే వీణగా మధు రసములు కొసరిన వేళలా
తొలి పరువము లొసగెడు సోయగం
కని పరవశం అందెను మానసం

ఎవరో వస్తారని (భూమికోసం)

పల్లవి:
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజము మరచి నిదురపోకుమా

చరణం1:
బడులేలేని పల్లెటూళ్ళలో
బడులేలేని పల్లెటూళ్ళలో చదువేరాని పిల్లలకు
చవుడు రాలే చదువుల బడిలో
జీతాల్రాని పంతుళ్ళకూ

చరణం2:
చాలీ చాలని పూరిగుడిసెలో
చాలీ చాలని పూరిగుడిసెలో కాలేకడుపుల పేదలకు
మందులులేని ఆసుపత్రిలో
పడిగాపులు పడు రోగులకు

చరణం3:
తరతరాలుగా మూఢాచారపు
వలలో చిక్కిన వనితలకు
అజ్ఞానానికి అన్యాయానికి
బలియైపోయిన పడతులకు

చరణం4:
కూలిడబ్బుతో లాటరీ టికెట్‌ లాటరీ టికెట్‌
కూలిడబ్బుతో లాటరీ టికెట్‌ కొనే దురాశా జీవులకు
దురలవాట్లతో బాధ్యత మరచి
చెడే నిరాశా జీవులకు

చరణం5:
సేద్యంలేని బీడునేలలో
పనులే లెని ప్రాణులకు
పగలూ రేయీ శ్రమపడుతున్నా
ఫలితం దక్కని దీనులకు

ఆకాశ వీధిలో(మాంగల్య భలం)

పల్లవి:
ఆకాశ వీధిలో అందాల జాబిలి
వయ్యారి తారను జేరి ఉయ్యాలలూగెనే సయ్యాటలాడెనే

చరణం1:
జలతారు మేలి మబ్బు పరదాలు నేసి తెరచాటు చేసి
పలుమారు దాగి దాగి పంతాలు పొయి పందాలు వేసి
అందాల చందామామ దొంగాటలాడెనే దోబూచులాడెనే

చరనం2:
జడివాన హోరుగాలి సుడిరేగి రాని జడిపించ బోనీ
కలకాలము నీవే నేనని పలుబాసలాడి చెలిచెంత చేరి
అందాల చందామామ అనురాగం చాటెనే నయగారం రేపెనే

సాహసి

ఎగిరించకు లోహవిహంగాలను!
కదిలించకు సప్తభుజంగాలను!
ఉండనీ,
మస్తిష్కకులాయంలో!
మనోవల్మీకంలో!
అంతరాళ భయంకర
ప్రాంతరాలనా నీ విహారం?
ముళ్లదారినా నీ సంచారం?
పలికించకు మౌనమృదంగాలను!
కెరలించకు శాంతరంగాలను!
హృదయంలో దీపం పెట్టకు!
మంత్రనగరి సరిహద్దులు ముట్టకు!

అవతారం

యముని మహిషపు లోహఘంటలు
మబ్బుచాటున
ఖణేల్‌మన్నాయి!
నరకలోకపు జాగిలమ్ములు
గొలుసు త్రెంచుకు
ఉరికిపడ్డాయి!
ఉదయ సూర్యుని సప్తహయములు
నురుగులెత్తే
పరుగు పెట్టేయి!
కనకదుర్గా చండసింహం జూలు దులిపీ, ఆవులించింది!
ఇంద్రదేవుని మదపుటేనుగు ఘీంకరిస్తూ, సవాల్‌చేసింది!
నందికేశుడు
రంకెవేస్తూ,
గంగడోలును కదిపిగెంతేడు!
ఆదిసూకర
వేదవేద్యుడు
ఘర్ఝరిస్తూ, కోరసాచాడు!
పుడమి తల్లికి
పురుటినొప్పులు
కొత్త సృష్టిని స్ఫురింపించాయి!

శైశవగీతి

పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-
కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ
ఏమీ ఎరుగని పూవుల్లారా,
అయిదారేడుల పాపల్లారా!
మెరుపు మెరిస్తే,
వాన కురిస్తే,
ఆకసమున హరివిల్లు విరిస్తే
అవి మీకే అని ఆనందించే
కూనల్లారా!
అచ్చటికిచ్చటి కనుకోకుండా
ఎచ్చటెచటికో ఎగురుతుపోయే
ఈలలు వేస్తూ ఎగురుతుపోయే
పిట్టల్లారా!
పిల్లల్లారా!
గరికిపచ్చ మైదానాల్లోనూ,
తామరపూవుల కోనేరులలో
పంటచేలలో, బొమ్మరిళ్లలో,
తండ్రి సందిటా, తల్లి కౌగిటా,
దేహధూళితో, కచభారంతో,
నోళుల వ్రేళులు, పాలబుగ్గలూ,
ఎక్కడ చూస్తే అక్కడ మీరై
విశ్వరూపమున విహరిస్తుండే
పరమాత్మలు
ఓ చిరుతల్లారా!
మీదే, మీదే సమస్తవిశ్వం!
మీరే లోకపు భాగ్యవిధాతలు!
మీ హాసంలో మెరుగులు తీరును
వచ్చేనాళ్ల విభాప్రభాతములు!
ఋతువుల రాణి వసంతకాలం
మంత్రకవాటం తెరచుకునీ,
కంచు వృషభముల అగ్నిశ్వాసం
క్రక్కే గ్రీష్మం కదలాడీ,
ఏళ్లు, బయళ్లూ, వూళ్లూ, బీళ్లూ
ఏకంచేసే వర్షాకాలం,
స్వచ్ఛ కౌముదుల శరన్నిశీథినులు,
హిమానీ నిబిడ హేమంతములు,
చలివడకించే శైశిరకాలం
వస్తూ పోతూ దాగుడుమూతల
క్రీడలాడుతవి మీ నిమత్తమే!
ఇవాళలాగే ఎప్పుడు కూడా
ఇనబింబం పయనించు నింగిపై!
ఎప్పుడు కూడా ఇవాళలాగే
గాలులు వీచును, పూవులు పూచును!
నాకు కనంబడు నానాతారక,
లనేక వర్ణా, లనంత రోచులు
దిక్కు దిక్కులా దివ్యగీతములు
మీరూ వాటికి వారసులే! ఇవి
మీలో కూడా మిలమిలలాడును!
నా గత శైశవ రాగమాలికల
ప్రతిధ్వనులకై,
పోయిన బాల్యపు చెరిగిన పదముల
చిహ్నాల కోసం,
ఒంటరిగా కూర్చిండి వూరువులు
కదిలే గాలికి కబళమునిస్తూ,
ప్రమాద వీణలు కమాచి పాడగ
సెలయేళ్లను, లేళ్లను లాలిస్తూ,
పాతాళానికి పల్టీకొట్టీ
వైతరణీనది లోతులు చూస్తూ,
శాంతములే, కేకాంతముగా, ది
గ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూ
మెటిక విరుస్తూ ఇట కూర్చిండిన
నను చూస్తుంటే నవ్వొస్తోందా?
ఉడుతల్లారా!
బుడతల్లారా!
ఇది నా గీతం, వింటారా?

కొంపెల్ల జనార్థనరావు కోసం

తలవంచుకు వెళ్లిపోయావా నేస్తం!
సెలవంటూ ఈ లోకాన్ని వదిలి...
తలపోసిన వేవీ కొనసాగకపోగా,
పరివేదన బరువు బరువు కాగా,
అటు చూస్తే, ఇటు చూస్తే ఎవరూ
చిరునవ్వూ, చేయూతా ఇవ్వక-
మురికితనం కరకుతనం నీ
సుకుమారపు హృదయానికి గాయం చేస్తే-
అటుపోతే, ఇటుపోతే అంతా
అనాదరణతో, అలక్ష్యంతో చూసి
ఒక్కణ్ణీ చేసి వేధించారని, బాధించారని,
వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్లిపోయావా, నేస్తం!
తలవంచుకు వెళ్లిపోయావా, నేస్తం!
దొంగలంజకొడుకు లసలే మెసలే ఈ
ధూర్తలోకంలో నిలబడజాలక
తలవంచుకునే వెళ్లిపోయావా, నేస్తం!
చిరునవ్వులనే పరిచేషన చేస్తూ...
అడుగడుగునా పొడచూపే
అనేకానేక శతృవులతో,
పొంచి చీకట్లో కరవజూసే
వంచకాల ఈ లోకంతో పొసగక
అంచితానంత శాంత సామ్రాజ్యం
దేన్ని వెతుక్కుంటూ వెళ్లావోయ్‌, నేస్తం!
ఎంత అన్యాయం చేశావోయ్‌, నేస్తం!
ఎన్ని ఆశలు నీమీద పెట్టుకుని,
ఎన్ని కలలు నీచుట్టూ పోగు చేసుకుని...
అన్నీ తన్నివేశావా, నేస్తం!
ఎంత దారుణం చేశావయ్యా, నేస్తం!
బరంపురంలో మనం ఇంకా
నిన్నగాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది!
కాకినాడ నవ్యసాహిత్య పరిషత్తును
కలకలలాడించిన నీ నవ్వు
కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే!
విశాఖపట్టణం వీధుల్లో మనం
'ఉదయిని' సంచికలు పట్టుకుని తిరగడం
జ్ఞాపకం ఉందా?
చెన్న పట్టణపు సముద్రతీరంలో మనం
అన్నీ పిచికగూళ్లేనా కట్టింది?
సాహిత్యమే సమస్తమూ అనుకుని
ఆకలీ నిద్రా లేక,
ఎక్కడ ఉన్నామో, ఎక్కడకు పోతామో తెలియని
ఆవేశంతో,
చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ
ఎక్కడకో పోతూన్న మనల్ని
రెక్కపట్టి నిలబెట్టి లోకం
ఎన్నెన్ని దుస్సహ దృశ్యాలు చూపించి,
ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి,
కలలకు పొగలనూ, కాటుకలనూ కప్పి,
శపించిందో, శఠించిందో మనల్ని:
తుదకు నిన్ను విషనాగురలలోనికి లాగి,
వూపిరితిత్తులను కొలిమితిత్తులుగా చేసి,
మా కళ్లల్లో గంధక జ్వాలలు,
గుండెలలో గుగ్గిలపు ధూమం వేసి,
మాదారిలో ప్రశ్నార్థ చిహ్నాల
బ్రహ్మ చెముడు డొంకలు కప్పి,
తలచుకున్నప్పుడల్లా,
తనువులో, అణువణువులో
సంవర్త భయంకర
ఝంఝూ పవనం రేగిస్తూ
ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను:
ఎంత మోసగించిందయ్యా మమ్ము:
ఎవరు దుఃఖించారులే, నేస్తం! నువ్వు చనిపోతే,
ఏదో నేనూ, ఆరుగురు స్నేహితులూ తప్ప!
ఆకాశం పడిపోకుండానే ఉంది!
ఆఫీసులకు సెలవు లేదు!
సారాదుకాణాల వ్యవహారం
సజావుగానే సాగింది!
సానుభూతి సభలలో ఎవరూ
సాశ్రు నేత్రాలు ప్రదర్శించలేదులే నీకోసం!
ఎవరి పనులలో వాళ్లు!
ఎవరి తొందరలో వాళ్లు!
ఎవరికి కావాలి, నేస్తం!
ఎమయిపోతేనేం నువ్వు!
ఎవ్వరూ నిన్ను స్మరించడం లేదులే!
ఎవరికి కావాలి, నేస్తం! నువ్వు
కాగితం మీద ఒకమాటకు బలి అయితే,
కనబడని వూహ నిన్ను కబళిస్తే,
అందని రెక్క నిన్ను మంత్రిస్తే! నియంత్రిస్తే!
ఎవరికి కావాలి నీ నేస్తం?
ఎమయి పోతేనేం నువు?
మా బురద రోజూ హాజరు!
మా బురఖా మేం తగిలించుకున్నాం!
మా కాళ్లకు డెక్కలు మొలిచాయి,
మా నెత్తికి కొమ్ముల లాగే!
మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు!
లేదు నేస్తం, లేదు!
నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు!
నిరుత్సాహాన్ని జయించడం
నీ వల్లనే నేర్చుకుంటున్నాము!
ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు
భయం లేదులే అయినప్పటికీ
నీ సాహసం ఒక ఉదాహరణ!
నీ జీవితమే ఒరవడి!
నిన్న వదిలిన పోరాటం
నేడు అందుకొనక తప్పదు!
కావున ఈ నిరాశామయలోకంలో
కదనశంఖం పూరిస్తున్నాను!
ఇక్కడ నిలబడి నిన్ను
ఇవాళ ఆవాహనం చేస్తున్నాను!
అందుకో ఈ చాచిన హస్తం!
ఆవేశించు నాలో!
ఇలా చూడు నీ కోసం
ఇదే నా మహాప్రస్థానం!

ఒక రాత్రి

గగనమంతా నిండి, పొగలాగు క్రమ్మి-
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!
ఆకాశపుటెడారి నంతటా, అకట!
ఈ రేయి రేగింది ఇసుక తుపాను!
గాలిలో కానరాని గడుసు దయ్యాలు
భూ దివమ్ముల మధ్య ఈదుతున్నాయి!
నోరెత్తి, హోరెత్తి నొగులు సాగరము!
కరి కళేబరములా కదలదు కొండ!
ఆకాశపు టెడారిలో కాళ్లు తెగిన
ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి!
విశ్వమంతా నిండి, వెలిబూదివోలె-
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!

ఆకాశదీపం

గదిలో ఎవరూ లేరు,
గదినిండా నిశ్శబ్దం.
సాయంత్రం ఆరున్నర,
గది లోపల చినుకుల వలె చీకట్లు.
ఖండపరశుగళ కపాలగణముల
చూస్తున్నది గది.
కనుకొలకులలో ఒకటివలె
చూపు లేని చూపులతో తేరి.
గదిలోపల ఏవేవో ఆవిరులు.
దూరాన నింగిమీద తోచిన ఒక చుక్క
మిణుకు చూపులు మెలమెల్లగా విసిరి
గదిని తలపోతతో కౌగిలించుకొంటున్నది.
ఒక దురదృష్టజీవి
ఉదయం ఆరున్నరకు
ఆ గదిలోనే ఆరిపోయాడు.
అతని దీపం ఆ గదిలో
మూలనక్కి మూలుగుతున్నది.
ప్రమిదలో చమురు త్రాగుతూ
పలు దిక్కులు చూస్తున్నది.
చీకటి బోనులో
సింహములా నిలుచున్నది.
కత్తిగంటు మీద
నెత్తుటి బొట్టులాగున్నది.
ప్రమిదలో నిలిచి
పలు దిక్కులు చూస్తున్నది దీపం.
అకస్మాత్తుగా ఆ దీపం
ఆకాశతారను చూసింది.
రాకాసి కేకలు వేసింది.
(నీకూ నాకూ చెవుల సోకని కేకలు)
ఆకాశతార ఆదరపు చూపులు చాపింది.
అలిసిపోయింది పాపం, దీపం.
ఆకాశతార ఆహ్వానగానం చేసింది.
దీపం ఆరిపోయింది.
తారగా మారిపోయింది.

ఒకక్షణంలో...

ఒక క్షణంలో
మనస్సులో ఏదో స్మృతి
తటిన్మణి
మణీఘృణి
ఏదో మతి వికాసించి
క్షణంలో
అదే పరుగు
మరేడకో...
ఆకులలో చీకటిలో
ఇరుల ఇరుకులలో
చినుకులలో
ఏడనో మరపులలో
మరపుల మడతలలో
కనబడక!
ఒక క్షణంలో
పూర్వపు సఖుని ముఖం
నవ్వులతో
రంగుల పువ్వులతో
కలకలమని కళలు కురిసి
హర్షంతో
ఆశావర్షంతో
కనుల వెనుక తెర ముందర
కనిపించి,
మరుక్షణం
విడివడి మరేడకో-
వడివడి మరేడకో!
ఒక క్షణంలో
సకలజగం
సరభసగమనంతో...
పిమ్మట నిశ్శబ్దం
ఆ క్షణమందే
గుండెల కొండలలో
మ్రోగును మార్మోగును
హుటాహుటి పరుగెత్తే
యుగాల రథానాదం.

పరాజితులు

అలసిన కన్నులు కాంచేదేమిటి?
తొణకిన స్వప్నం,
తొలగిన స్వర్గం!

చెదిరిన గుండెల నదిమే దేమిటి?
అవతల, ఇవతల
అరులై ఇరులే!

విసిగిన ప్రాణుల పిలిచే దెవ్వరు?
దుర్హతి, దుర్గతి,
దుర్మతి, దుర్మ్రుతి!

ప్రతిజ్ఞ

పొలాల నన్నీ ,
హలాల దున్నీ,
ఇలాతలంలో హేమం పిండగ-
జగానికంతా సౌఖ్యం నిండగ-
విరామ మెరుగక పరిశ్రమించే,
బలం ధరిత్రికి బలి కావించే,
కర్షక వీరుల కాయం నిండా
కాలువకట్టే ఘర్మజలానికి,
ఘర్మజలానికి,
ధర్మజలానికి,
ఘర్మజలానికి ఖరీదు లేదోయ్!

నరాల బిగువూ,
కరాల సత్తువ
వరాల వర్షం కురిపించాలని,
ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని-
గనిలో, పనిలో, కార్ఖానాలో
పరిక్లమిస్తూ,
పరిప్లవిస్తూ
ధనికస్వామికి దాస్యంచేసే,
యంత్రభూతముల కోరలు తోమే,
కార్మిక వీరుల కన్నుల నిండా
కణ కణ మండే,
గలగల తొణికే
విలాపాగ్నులకు, విషాదాశ్రులకు
ఖరీదుకట్టే షరాబు లేడోయ్!

నిరపరాధులై దురద్రుష్టంచే
చెరసాలలలో చిక్కేవాళ్ళూ-
లోహ రాక్షసుల పదఘట్టనచే
కొనప్రాణంతో కనలేవాళ్ళూ-
కష్టం చాలక కడుపుమంటచే
తెగించి సమ్మెలు కట్టేవాళ్ళూ-
శ్రమ నిష్పలమై, జని నిష్ఠురమై,
నూతిని గోతిని వెదికేవాళ్ళూ-
అనేకులింకా అభాగ్యులంతా,
అనాధులంతా,
అశాంతులంతా
దీర్ఘశ్రుతిలో, తీవ్రధ్వనితో
విప్లవశంఖం వినిపిస్తారోయ్!

కావున-లోకపుటన్యాయాలూ,
కాల్చేఆకలి, కూల్చే వేదన,
దారిద్ర్యాలూ, దౌర్జన్యాలూ
పరిష్కరించే, బహిష్కరించే
బాటలు తీస్తూ, పాటలు వ్రాస్తూ,
నాలో కదలే నవ్యకవిత్వం
కార్మిక లోకపు కల్యాణానికి,
శ్రామిక లోకపు సౌభాగ్యానికి
సమర్పణంగా, సమర్చనంగా-
త్రిలోకాలలో, త్రికాలాలలో
శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనేలేదని
కష్టజీవులకు, కర్మవీరులకు
నిత్యమంగళం నిర్దేశిస్తూ,
స్వస్తివాక్యములు సంధానిస్తూ,
స్వర్ణవాద్యములు సంరావిస్తూ-
వ్యధార్త జీవిత యధార్ధ ద్రుశ్యం
పునాదిగా ఇక జనించబోయే
భావివేదముల జీవనాదములు
జగత్తుకంతా చవులిస్తానోయ్!

కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం,
జాలరి పగ్గం, సాలెల మగ్గం,
శరీరకష్టం స్ఫురింపజేసే
గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి,
సహస్ర వ్రుత్తుల సమస్త చిహ్నాలు-
నా వినుతించే,
నా విరుతించే,
నా వినిపించే నవీన గీతికి,
నా విరచించే నవీన రీతికి,
భావ్యం!
భాగ్యం!
ప్రాణం!
ప్రణవం.

కళారవి

పోనీ, పోనీ,
పోతే పోనీ!
సతుల్, సుతుల్, హితుల్ పోనీ!
పోతే పోనీ!

రానీ, రానీ,
వస్తే రానీ!
కష్టాల్, నష్టాల్,
కోపాల్, తాపాల్, శాపాల్ రానీ!
వస్తే రానీ!
తిట్లూ, రాట్లూ, పోట్లూ, రానీ!
రానీ, రానీ!

కానీ, కానీ!
గానం, ధ్యానం!
హాసం, లాసం!
కానీ, కానీ!
కళారవీ! పవీ! కవీ!

దేశ చరిత్రలు

ఏ దేశచరిత్ర చూచినా
ఏమున్నది గర్వకారణం?
నరజాతి చరిత్ర సమస్తం
పరపీడన పరాయణత్వం.

నరజాతి చరిత్ర సమస్తం
పరస్పరాహరణోద్యోగం..
నరజాతి చరిత్ర సమస్తం
రణరక్త ప్రవాహసిక్తం.

భీభత్సరస ప్రధానం,
పిశాచగణ సమవాకారం!
నరజాతి చరిత్ర సమస్తం
దరిద్రులను కాల్చుకు తినడం

బలవంతులు దుర్బల జాతిని
బానిసలను కావించారు..
నరహంతలు ధరాధిపతులై
చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి

రణరంగం కానిచోటు భూ
స్థలమంతా వెదకిన దొరకదు..
గతమంతా తడిసె రక్తమున,
కాకుంటే కన్నీళులతో

చల్లారిన సంసారాలూ,
మరణించిన జన సందోహం,
అసహాయుల హాహాకారం
చరిత్రలో మూలుగుతున్నవి

వైషమ్యం, స్వార్ధపరత్వం,
కౌటిల్యం, ఈర్ష్యలు, స్పర్ధలు
మాయలతో, మారుపేర్లతో
చరిత్ర గతి నిరూపించినవి

జెంఘిజ్ ఖాన్, తామర్లేనూ
నాదిర్షా, ఘజ్నీ, ఘోరీ,
సికందరో ఎవడైతేనేం?
ఒక్కొక్కడూ మహాహంతకుడు

వైకింగులు, శ్వేతహూణులూ,
సిధియన్లూ, పారశీకులూ,
పిండారులూ, ధగ్గులు కట్టిరి
కాలానికి కత్తుల వంతెన

అగ్నానపు టంధయుగంలో,
ఆకలిలో, ఆవేశంలో-
తెలియని ఏ తీవ్రశక్తులో
నడిపిస్తే నడచి మనుష్యులు-

అంతా తమ ప్రయోజకత్వం,
తామే భువి కధినాధులమని,
స్ధాపించిన సామ్రాజ్యాలూ,
నిర్మించిన క్రుత్రిమ చట్టాల్

ఇతరేతర శక్తులు లేస్తే
పడిపోయెను పేక మేడలై!
పరస్పరం సంఘర్షించిన
శక్తులలో చరిత్ర పుట్టెను

చిరకాలం జరిగిన మోసం,
బలవంతుల దౌర్జన్యాలూ,
ధనవంతుల పన్నాగాలూ
ఇంకానా! ఇకపై చెల్లవు

ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తీ,
ఒక జాతిని వేరొక జాతీ,
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా? ఇకపై సాగదు

చీనాలో రిక్షావాలా,
చెక్ దేశపు గని పనిమనిషీ,
ఐర్లాండున ఓడ కళాసీ,
అణగారిన ఆర్తులందరూ -

హాటెన్ టాట్, జూలూ, నీగ్రో,
ఖండాంతర నానా జాతులు
చారిత్రక యధార్ధతత్వం
చాటిస్తా రొక గొంతుకతో

ఏ యుద్ధం ఎందుకు జరిగెనో?
ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో?
తారీఖులు, దస్తావేజులు
ఇవి కావోయ్ చరిత్రకర్ధం

ఈ రాణీ ప్రేమపురాణం,
ఆ ముట్టడికైన ఖర్చులూ,
మతలబులూ, కైఫీయతులూ
ఇవి కావోయ్ చరిత్రసారం

ఇతిహాసపు చీకతికోణం
అట్టడుగున పడి కాన్పించని
కధలన్నీ కావాలిప్పుడు!
దాచేస్తే దాగని సత్యం

నైలునదీ నాగరికతలో
సామాన్యుని జీవన మెట్టిది?
తాజమహల్ నిర్మాణానికి
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?

సామ్రాజ్యపు దండయాత్రలో
సామాన్యుల సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్,
అది మోసిన బోయీలెవ్వరు?

తక్షశిలా, పాటలీపుత్రం,
మధ్యధరా సముద్రతీరం,
హరప్పా, మొహేంజదారో,
క్రో - మాన్యాన్ గుహముఖాల్లో -

చారిత్రక విభాత సంధ్యల
మానవకధ వికాసమెట్టిది?
ఏ దేశం ఏ కాలంలో
సాధించిన దేపరమార్ధం?

ఏ శిల్పం? ఏ సాహిత్యం?
ఏ శాస్త్రం? ఏ గాంధర్వం?
ఏ వెల్గుల కీ ప్రస్థానం?
ఏ స్వప్నం? ఏ దిగ్విజయం?

జగన్నాథ రధచక్రాలు

జగన్నాథ రధచక్రాలు
పతితులార!
భ్రష్టులార
బాధాసర్ప దష్టులార!
బ్రతుకు కాలి,
పనికిమాలి,
శని దేవత రధచక్రపు
టిరుసులలో పడి నలిగిన
దీనులార!
హీనులార!
కూడు లేని, గూడు లేని
పక్షులార!భిక్షులార!
సఖులవలన పరిచ్యుతులు,
జనులవలన తిరస్క్రుతులు,
సంఘానికి బహిష్క్రుతులు
జితాసువులు,
చ్యుతాశయులు,
హ్రుతాశ్రయులు,
హతాశులై
ఏడవకం డేడవకండి!
మీ రక్తం, కలగి కలగి
మీ నాడులు కదలి కదలి
మీ ప్రేవులు కనలి కనలి
ఏడవకం ఏడవకండి!
ఓ వ్యధా నినిష్టులార!
ఓ కధా వశిష్టులార!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
ఏడవకం డేడవకండి!

వస్తున్నా యొస్తున్నయి...
జగన్నాధ,
జగన్నాధ,
జగన్నాధ రధచక్రాల్!
జగన్నాధుని రధచక్రాల్!
రధచక్రాల్,
రధచక్రాల్,
రధచక్రాల్, రధచక్రా
లొస్తునా యొస్తునాయి!

పతితులార!
భ్రష్టులార!
మొయిల్దారిని
బయల్దేరిన
రధచక్రాల్, రధచక్రా
లొస్తునా యొస్తున్నాయి!

సింహాచలం కదిలింది,
హిమాలయం కరిగింది,
వింధ్యాచలం పగిలింది -
సింహాచలం,
హిమాచలం,
వింధ్యాచలం, సంధ్యాచలం...
మహానగా లెగురుతున్నాయి!
మహారధం కదులుతున్నాది!
చూర్ణమాన
ఘార్ణమాన
దీర్ణమాన గిరిశిఖరాల్
గిర గిర గిర తిరుగుతున్నాయి!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
రారండో! రండో! రండి!

ఊరవతల నీరింకిన
చెరువుపక్క, చెట్టునీడ
గోనెలతో, కుండలతో,
ఎటుచూస్తే అటు చీకటి,
అటు దుఃఖం, పటునిరాశ -
చెరసాలలు, ఉరికొయ్యలు,
కాలువలో ఆత్మహత్య!
దగాపడిన తమ్ములార!
మీ బాధలు నే నెరుగుదును..
. వడలో, కడు
జడిలో, పెను
చలిలో తెగనవసి కుములు
మీ బాధలు, మీ గాధలు
అవగాహన నాకవుతాయి
పతితులార!
బ్రష్టులార!
దగాపడిన తమ్ములార!
మీ కోసం కలం పట్టి,
ఆకాశపు దారులంట
అడావుదిగ వెళిపోయే,
అరచుకుంటు వెళిపోయే
జగన్నాధుని రధచక్రాల్,
రధచక్ర ప్రలయఘోష
భూమార్గం పట్టిస్తాను!
భూకంపం పుట్టిస్తాను!

నట ధూర్జటి
నిటాలాక్షి పగిలిందట!
నిటాలాగ్ని రగిలిందట!
నిటాలాగ్ని!
నిటాలార్చి!
నిటాలాక్షి పటాలుమని
ప్రపంచాన్ని భయపెట్టింది!

అరె ఝాం! ఝాం!
ఝుటక్, ఫటక్ ...

హింసనచణ
ధ్వంసరచన
ధ్వంసనచణ
హింస రచన!
విషవాయువు, మర ఫిరంగి,
టార్పీడో, టోర్నాడో!
అది విలయం,
అది సమరం,
అటో యిటో తెగిపోతుంది?
సంరంభం,
సంక్షోభం,
సమ్మర్దన, సంఘర్షణ!
హాలాహలం పొగచూరింది!
కోలాహలం చెలరేగింది
పతితులార!
భ్రష్టులార!
ఇది సవనం,
ఇది సమరం!
ఈ యెరిగిన ఇనుప డేగ,
ఈ పండిన మంట పంట-
ద్రోహాలను తూలగొట్టి,
దోషాలను తుడిచి పెట్టి,
స్వాతంత్ర్యం,
సమభావం,
సౌభ్రాత్రం,
సౌహార్దం
పునాదులై ఇళ్ళు లేచి,
జనవాళికి శుభం పూచి -
శాంతి, శాంతి, కాంతి, శాంతి
జగమంతా జయిస్తుంది,
ఈ స్వప్నం నిజమవుతుంది!
ఈ స్వర్గం ఋజువవుతుంది!
పతితులార!
భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
దగాపడిన తమ్ములార!
ఏడవకం డేడవకండి!

ఆః!

ఆః!
నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు-

నెత్తురు క్రక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే,
నిర్దాక్షిణ్యంగా వీరే...

అంకితం

అంకితం
తలవంచుకు వెళిపోయావా, నేస్తం!
సెలవంటూ ఈ లోకాన్ని వదలి

తలపోసిన వేవీ కొనసాగకపోగా,
సరివేదన బరువు బరువు కాగా,
అటు చూస్తే, ఇటు చూస్తే ఎవరూ
చిరునవ్వూ, చేయూతా ఇవ్వక-
మురికితనం కరుకుతనం నీ
సుకుమారపు హ్రుదయానకు గాయం చేస్తే,
అటుపోతే, ఇటుపోతే అంతా
అనాదరణతో, అలక్ష్యంతో చూసి,
ఒక్కణ్ణీచేసి వేధించారని, బాధించారని
వెక్కి వెక్కి ఏడుస్తూ వెళిపోయావా, నేస్తం!

దొంగలంజకొడుకులసలే మెసలే ఈ
ధూర్తలోకంలో నిలబడజాలక
తలవంచుకునే వెళిపోయావా, నేస్తం!
చిరునవ్వులనే పరిచేషన చేస్తూ...

అడుగడుగునా పొడచూపే
అనేకానేక శత్రువులతో,
పొంచి చీకట్లో కరవజూసే
వంచకాల ఈ లోకంతో పొసగక
అంచితానంత శాంత సామ్రాజ్యం
దేన్ని వెతుక్కుంటూ వెళ్ళావోయ్, నేస్తం!
ఎంత అన్యాయం చేసావోయ్, నేస్తం!
ఎన్ని ఆశలు నీమీద పెట్టుకొని,
ఎన్ని కలలు నీచుట్టూ పోగుచేసుకొని
అన్నీ తన్నివేశావా, నేస్తం!
ఎంత దారుణం చేశావయ్యా, నేస్తం!

బరంపురంలూ మనం ఇంకా
నిన్నగాక మొన్న మాట్లాడుతున్నట్టే ఉంది!
కాకినాడ నవ్యసాహిత్య పరిషత్తును
కలకలలాడించిన నీ నవ్వు
కనబడకుండా కరిగిపోయిందా ఇంతట్లోనే!
విశాఖపట్టణం వీధుల్లో మనం
"ఉదయిని" సంచికలు పట్టుకు తిరగటం
జ్ఞాపకం ఉందా?
చెన్నపట్టణపు సముద్రతీరంలో మనం
అన్నీ పిచికగూళ్ళేనా కట్టింది?
సాహిత్యమే సమస్తమూ అనుకొని,
ఆకలీ, నిద్రా లేక,
ఎక్కడ ఉన్నామో, ఎక్కడకు పోతామో తెలియని
ఆవేశంతో,
చుక్కలలో ఆదర్శాలను లెక్కిస్తూ
ఎక్కడికో పోతున్న మనల్ని
రెక్కపట్టి నిలబెట్టి లోకం
ఎన్నెన్ని దుస్సహ ద్రుశ్యాలు చూపించి,
ఎన్నెన్ని దుస్తర విఘ్నాలు కల్పించి,
కలలకు పొగలనూ, కాటుకలనూ కప్పి,
శపించిందో, శఠించిందో మనల్ని!
తుదకు నిన్ను విషవాగురలలోనికి లాగి
, ఊపిరితిత్తులను కొలిమితిత్తులుగా చేసి,
మా కళ్ళల్లో గంధక జ్వాలలు,
గుండెలలో గుగ్గిలపు ధూమం వేసి,
మా దారిలో ప్రశ్నార్ద చిహ్నాల
బ్రహ్మ చెముడు డొంకలు కప్పి,
తలచుకున్నప్పుడల్లా
తనువులో, అణువణువులో
సంవర్త భయంకర
ఝుంఝూపవనం రేగిస్తూ
ఎక్కడకు విసిరిందయ్యా నిన్ను!
ఎంత మోసగించావయ్య మమ్ము!

ఎవరు దుఃఖించారులే, నేస్తం! నువ్వు చనిపోతే,
ఏదో నేనూ, ఆరుగురు స్నేహితులూ తప్ప!
ఆకాశం పడిపోకుండానే ఉంది!
ఆఫీసులకు సెలవు లేదు!
సారాదుకాణాల వ్యవహారం
సజావుగానే సాగింది!
సానుభూతి సభలలో ఎవరూ
సాశ్రునేత్రాలు ప్రదర్శించలేదులే నీ కోసం!
ఎవరి పనులలో వాళ్ళు!
ఎవరి తొందరలో వాళ్ళు!
ఎవరికి కావాలి, నేస్తం!
ఏమయిపోతేనేం నువ్వు?
ఎవ్వరూ నిన్ను స్మరించడం లేదులే!
ఎవరికి కావాలి, నేస్తం! నువ్వు
కగితంమీద ఒక మాటకు బలి అయితే,
కనబడని ఊహ నిను కబళిస్తే!
అందని రెక్క నిన్ను మంత్రిస్తే! నిమంత్రిస్తే!
ఎవరికి కావాలి నీ నేస్తం?
ఏమయిపోతేనేం నువ్వు?
మా బురద రోజూ హాజరు!
మా బురఖా మేము తగిలించుకున్నాం!
మా కాళ్ళకు డెక్కలు మొలిచాయి,
మా నెత్తికి కొమ్ముల లాగే!
మమ్మల్ని నువ్వు పోల్చుకోలేవు!
లేదు, నేస్తం! లేదు..
నీ ప్రాభవం మమ్మల్ని వదలలేదు!
నిరుత్సాహాన్ని జయించడం
నీ వల్లనే నేర్చుకుంటున్నాము!
ప్రతికూల శక్తుల బలం మాకు తెలుసు!
భయం లేదులే అయినప్పటికీ!
నీ సాహసం ఒక ఉదాహరణ!
నీ జీవితమే ఒరవడి!
నిన్న వదలిన పోరాటం
నేడు అందుకొనక తప్పదు!

కావున ఈ నిరాశామయలోకంలో
కదనశంఖం పూరిస్తున్నాను!
ఇక్కడ నిలబడి నిన్ను
ఇవాళ ఆవాహనం చేస్తున్నాను!
అందుకో ఈ చాచిన హస్తం!
ఆవేశించు నాలో!
ఇలా చూడు నీ కోసం
ఇదే నా మహాప్రస్థానం!

భూతాన్ని,
యజ్నోపవీతాన్ని,
వైప్లవ్యగీతాన్ని నెను!

స్మరిస్తే పద్యమ్,
అరిస్తే వాద్యమ్,
అనల వేదికమున్దు అస్ర నైవేద్యమ్!

లోకాలు,
భవభూతి శ్లోకాలు,
పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు!

నా ఊహ ఛామ్పేయమాల!
రస రాజ్యడోల!
నా ఊళ కేదార గౌళ!

గిరులు,
సాగరులు, కన్కేలికా మఞరులు,
ఝరులు నా సోదరులు!

నేనొక దుర్గమ్!
నాదొక స్వర్గమ్!
అనర్గళమ్, అనితర సాద్యమ్, నా మార్గమ్!

ఆశాదూతలు

స్వర్గాలు కరిగిన్ఛి
స్వప్నాలు పగిలిన్ఛి,
రగిలిన్ఛి రక్తాలు, రాజ్యాలు కదిపి
ఒకడు తూరుపు దిక్కునకు!

పాపాలు పన్డిన్ఛి,
భావాలు మన్డిన్ఛి,
కొలిమి నిప్పులు రువ్వి, విలయలయనవ్వి
ఒకడు దక్షిణ దిక్కు!

ప్రాకారములు దాటి,
ఆకాశములు తాకి,
లోకాలు ఘాకాల బాకాలతో నిన్ఛి,
ఒకడు దీఛికి!

సిన్దూర భస్మాలు,
మన్దార హారాలు
సాన్ద్రఛన్దన ఛర్ఛ సవరిన్ఛి
ఒకడు పడమటికి!

మానవకోటి సామ్రాజ్యదూతలు, కళా
యజ్నాశ్వముల్ గాలులై, తరగలై, తావులై,
పుప్పొళ్ళు, కుమ్కుమల్, పొగలై సాగిరి!

బాటసారి

కూటికోసం, కూలికోసం
పట్టణంలో బ్రతుకుదామని-
తల్లిమాటలు చెవిని పెట్టక
బయలుదేరిన బాటసారికి,
మూడురోజులు ఒక్కతీరుగ
నడుస్తున్నా దిక్కు తెలియక-
నడి సముద్రపు నావ రీతిగ
సంచరిస్తూ, సంచలిస్తూ,
దిగులు పడుతూ, దీనుడౌతూ
తిరుగుతుంటే-
చండ చండం, తీవ్ర తీవ్రం
జ్వరం కాస్తే,
భయం వేస్తే,
ప్రలాపిస్తే-
మబ్బుపట్టీ, గాలికొట్టీ,
వానవస్తే, వరదవస్తే,
చిమ్మచీకటి క్రమ్ముకొస్తే
దారితప్పిన బాటసారికి
ఎంత కష్టం!

కళ్ళు వాకిట నిలిపిచూచే
పల్లెటూళ్ళో తల్లి ఏమని
పలవరిస్తుందో...?
చింతనిప్పులలాగు కన్నుల
చెరిగిపోసే మంటలెత్తగ,
గుండుసూదులు గ్రుచ్చినట్లే,
శిరోవేదన అతిశయించగ,
రాత్రి, నల్లని రాతి పోలిక
గుండె మీదనె కూరుచుండగ,
తల్లిపిల్చే కల్ల ద్రుశ్యం
కళ్ళ ముందట గంతులేయగ
చెవులుసోకని పిలుపులేవో
తలచుకుంటూ-
తల్లడిల్లే,
కెళ్ళగిల్లే
పల్లటిల్లే బాటసారికి
ఎంత కష్టం!

అతని బ్రతుకున కదే ఆఖరు!
గ్రుడ్డి చీకటిలోన గూబలు
ఘూంకరించాయి..
వానవెలసీ మబ్బులో ఒక
మెరుపు మెరిసింది..
వేగు జామును తెలియజేస్తూ
కోడి కూసింది..
విడిన మబ్బుల నడుమనుండీ
వేగుచుక్కా వెక్కిరించింది..
బాటసారి కళేబరంతో
శితవాయువు ఆడుకుంటోంది!
పల్లెటూళ్ళో తల్లికేదో
పాడుకలలో పేగు కదిలింది!

అవతారమ్

యముని మహిషపు లోహఘన్టలు
మబ్బు ఛాటున
ఖణేల్మన్నాయి!

నరకలోకపు జాగిలమ్ములు
గొలుసు త్రెన్ఛుకు
ఉరికిపడ్డాయి!

ఉదయ సూర్యుని సప్తహయములు
నురుగులెత్తే
పరుగు పెట్టేయి!

కనకదుర్గా ఛన్డ సిమ్హమ్ జూలు దులిపీ, ఆవులిన్ఛిన్ది!
ఇన్ద్ర దేవుని మదపుటేనుగు ఘీన్కరిస్తూ, సవాల్ ఛెసిన్ది!
నన్దికేసుడు
రన్కె వేస్తూ,
గఙడోలును కదిపి గెన్తేడు!

ఆదిసూకర
వేదవేద్యుడు
ఘర్ఘరిస్తూ, కోర సాఛాడు!

పుడమి తల్లికి
పురుటి నొప్పులు
కొత్త స్రుష్టిని స్ఫురిమ్పిన్ఛాయి!

రుక్కులు

కుక్క పిల్లా,
అగ్గి పుల్లా,
సబ్బు బిళ్ళా
హీనమ్గా ఛూడకు దేన్నీ!
కవితామయమేనోయ్ అన్నీ!

రొట్టె ముక్కా,
అరటి తొక్కా,
బల్ల ఛెక్కా
నీవైపే ఛూస్తూ ఉన్టాయ్!
తమ లోతు కనుక్కో*ఙన్టాయ్!

తలుపుగొళ్ళెమ్,
హారతి పళ్ళెమ్,
గుర్రపు కళ్ళెమ్
కాదేదీ కవిత కనర్హమ్!
ఔనౌను శిల్పమనర్హమ్!

ఉన్డాలోయ్ కవితావేశమ్!
కానీవోయ్ రస నిర్దేశమ్!
దొరకదటోయ్ శోభాలేశమ్!
కళ్ళన్టూ ఉన్టే ఛూసి,
వాక్కున్టే వ్రాసి!
ప్రపన్ఛమొక పద్మవ్యూహమ్!
కవిత్వమొక తీరని దాహమ్!

ఆకాశదీపమ్

గదిలో ఎవరూ లేరు,
గది నిన్డా నిశ్శబ్దమ్.
సాయన్త్రమ్ ఆరున్నర,
గదిలోపల ఛినుకులవలె ఛీకట్లు.
ఖన్డపరశుగళ కపాలగణముల
ఛూస్తున్నది గది.

కనుకొలనులలో ఒకటివలె
ఛూపులేని ఛూపులతో తేరి
గదిలోపల ఎవేవో ఆవిరులు
దూరాన నిమ్గిమీద తోఛిన ఒక ఛుక్క
మిణుకుఛూపులు మెల్ల మెల్లగా విసిరి
గదిని తలపోతతో కౌగలిన్ఛుకొన్టున్నది
ఒక దురద్రుష్టజీవి
ఉదయమ్ ఆరున్నరకు
ఆ గదిలోనే ఆరిపోయాడు
అతని దీపమ్ ఆ గదిలో
మూలనక్కి మూలుగుతున్నది
ప్రమిదలో ఛమురు త్రాగుతూ
పలు దిక్కులు ఛూస్తున్నది
ఛీకటి బోనులో
సిమ్హములా నిలుఛున్నది
కత్తిగన్టు మీద
నెత్తుటి బొట్టులాగున్నది
ప్రమిదలొ నిలిఛి
పలిదిక్కులు ఛూస్తున్నది దీపమ్
అకస్మాత్తుగా ఆ దీపమ్
ఆకాశతారను ఛూసిన్ది
రాకాసి కేకలు వేసిన్ది.
(నీకు నాకు ఛెవుల సోకని కేకలు)
ఆకాశతార ఆదరపు ఛూపులు ఛాపిన్ది
అలిసిపోయిన్ది పాపమ్, దీపమ్.
ఆకాశతార ఆహ్వానగానమ్ ఛేసిన్ది
దీపమ్ ఆరిపోయిన్ది
తారగా మారిపోయిన్ది.

గన్టలు!

పట్టణాలలొ, పల్లెటూళ్లలొ,
బట్టయబలునా, పర్వతగుహలా,
ఎడారులన్దూ,సముద్రమన్దూ,
అడవుల వెన్టా,అగడ్తలన్టా,
ప్రపన్ఛమన్తా ప్రతిద్వనిస్తూ
గన్టలు, గన్టలు, గన్టలు,గన్టలు!
గణ గణ గణ గణ గణ గణ గన్టలు!

భయన్కరముగా, పరిహాసముగా
ఉద్రేకముతో, ఉల్లాసముతో,
సక్రొదముగా,జాలిజాలిగా,
అనురాగముతో, అర్భాటముతో,
ఒకమారిఛటా, ఒకమారఛటా,
గన్టలు గన్టలు!
గన్టలు గన్టలు!
సి*మ్హములాగా, సివఙిలాగూ,
ఫిర*ఙిలాగు, కురఙిలాగూ,
స్రుగాలమట్లూ, బిడాలమట్లూ,
పన్డితులట్లూ, బాలకులట్లూ,
గొణ గొణ గణ గణ
గణ గణ గొణ గొణ
గన్టలు గన్టలు!

కర్మగారము,కళాయతనమూ,
కార్యాలయమూ, కారాగ్రుహముల,
డేవుని గుడిలో, బడిలో ,మడిలో,
ప్రాణము మ్రోగే ప్రతిస్తలములో,
నీ హ్రుదయములో, నా హ్రుదయములో
గన్టలు గన్టలు!
గన్టలు గన్టలు!

ఉత్తరమన్డూ, దక్షిణమన్డూ,
ఉదయమునన్డూ, ప్రదోషమన్డూ,
వెన్నెలలోనూ, ఛీకటిలోను,
మన్డుటెన్డలో, జడిలో, ఛలిలో,
ఇపుడూ,అపుడూ, ఎపుడూ మోగెడు
గన్టలు గన్టలు గన్టలు గన్టలు!
గణగణ గణగణ గన్టలు గన్టలు!
గణగణ గన్టలు!
గన్టలు గన్టలు!

ఒక రాత్రి

గగనమన్తా నిన్డి, పొగలాగు క్రమ్మి
భహుళ పన్ఛమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!
ఆకాశపుటెడారినన్తటా, అకట!
ఈ రేయి రేగిన్డి ఇసుక తుఫాను!
గాలిలో కానరాని గడుసు దయ్యాలు
భూ దివమ్ముల మద్య ఈదుతున్నాయి!
నోరెత్తి, హోరెత్తి నొగులు సాగరము!
కరి కళేబరములా కదలదు కొన్డ!
ఆకాశపుటెడారిలో కాళ్ళు తెగిన
ఒన్టరి ఒన్టెలాగున్ది జాబిల్లి!
విశ్వమన్తా నిన్డి, వెలిబూదివోలె
బహుళ పన్ఛమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!

జయభేరి

నేను సైతం
ప్రపంచాగ్నికి
సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!

నేను సైతం
విశ్వవ్రుష్టికి
అశ్రు వొక్కటి ధారపోశాను!

నేను సైతం
భువన ఘోషకు
వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!

ఎండాకాలం మండినప్పుడు
గబ్బిలవలె
క్రాగిపోలేదా!

వానాకాలం ముసిరిరాగా
నిలివు నిలువున
నీరు కాలేదా?
శీతాకాలం కోతపెట్టగ
కొరడు కట్టీ,
ఆకలేసీ కేకలేశానే!

నే నొక్కణ్ణే
నిల్చిపోతే-
చండ్ర గాడ్పులు, వానమబ్బులు, మంచుసోనలు
భూమి మీదా
భగ్నమౌతాయి!

నింగినుండీ తొంగిచూసే
రంగు రంగుల చుక్కలన్నీ
రాలి, నెత్తురు క్రక్కుకుంటూ
పేలిపోతాయి!

పగళ్ళన్నీ పగిలిపోయీ,
నిశీధాలూ విశీర్ణిల్లీ,
మహాప్రళయం జగం నిండా
ప్రగల్భిస్తుంది!

నే నొకణ్ణీ ధాత్రినిండా
నిండిపోయీ-
నా కుహూరుత శీకరాలే
లోకమంతా జల్లులాడే
ఆ ముహూర్తా లాగమిస్తాయి!

నేను సైతం
ప్రపంచాబ్జపు
తెల్లరేకై పల్లవిస్తాను!

నేను సైతం
విశ్వవీణకు
తంత్రినై మూర్చనలు పోతాను!

నేను సైతం
భువన భవనపు
బావుటానై పైకి లేస్తాను!

మహాప్రస్తానమ్

మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
పోదాం, పోదాం పైపైకి!

కదం త్రొక్కుతూ,
పదం పాడుతూ,
హ్రుదాంతరాళం గర్జిస్తూ-
పదండి పోదాం,
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం?

దారిపొడుగునా గుండె నెత్తురులు
తర్పణచేస్తూ పదండి ముందుకు!
బాటలు నడచీ,
పేటలు కడచీ,
కోటలన్నిటిని దాటండి!
నదీ నదాలూ,
అడవులు, కొండలు,
ఎడారులా మన కడ్డంకి?

పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
పూదాం, పోదాం, పైపైకి!
ఎముకులు క్రుళ్ళిన,
వయస్సు మళ్ళిన
సోమరులారా! చావండి!
నెత్తురు మండే,
శక్తులు నిండే,
సైనికులారా! రారండి!
"హరోం! హరోం హర!
హర! హర! హర! హర!
హరోం హరా!" అని కదలండి!
మరో ప్రపంచం,
మహా ప్రపంచం
ధరిత్రినిండా నిండింది!
పదండి ముందుకు,
పదండి త్రోసుకు!
ప్రభంజనంవలె హోరెత్తండీ!
భావ వేగమున ప్రసరించండీ!
వర్షుకాభ్రములన ప్రళయఘోషవలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!
పదండి,
పదండి,
పదండి ముందుకు!
కనబడలేదా మరో ప్రపంచపు
కణకణమండే త్రేతాగ్ని?

ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరువులు!
తిరిగి, తిరిగి, తిరిగి సముద్రాల్
జలప్రళయ నాట్యం చేస్తున్నవి!
సలసలక్రాగే చమురా? కాదిది
ఉష్ణరక్త కాసారం!
శివసముద్రమూ,
నయాగరావలె
ఉరకండీ! ఉరకండీ ముందుకు!
పదండి ముందుకు!
పదండి త్రోసుకు!
మరో ప్రపంచపు కంచు నగారా
విరామ మెరుగక మ్రోగింది!

త్రాచులవలెనూ,
రేచులవలనూ,
ధనంజయునిలా సాగండి!
కనబడలేదా మరో ప్రపంచపు
అగ్నికిరీటపు ధగధగలు,
ఎర్రబావుటా నిగనిగలు,
హోమజ్వాలల భుగభుగలు?