Wednesday, December 6, 2006

తెలియని ఆనందం(మాంగల్య భలం)

పల్లవి
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పరవశమై పాడే నా హృఉదయం

చరణం 1
కల కలలాడెను వసంత వనము
మైమరపించెను మలయా నిలము
తీయని ఊహల ఊయలలూగి తేలే మానసము
ఏమో తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

చరణం 2
రోజు పూచే రోజా పూలు వొలికించినవి నవరాగాలు
పరిచయమైన కొయిల పాటే కురిసే అనురాగం
ఏమో తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

చరణం 3
అరుణ కిరణముల గిలిగింతలలో కరగిన తెలి మంచు తెరలే తరలి
యెరుగని వింతలు యదుటే నిలిచి వెలుగే వికసించే
ఏమో తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం

No comments: