Wednesday, December 6, 2006

హాయి హాయిగ జాబిల్లి (వెలుగు నీడలు)

పల్లవి
హాయి హాయిగ జాబిల్లి
తొలిరేయి వెండి దారాలల్లి
మందుజల్లి నవ్వసాగే ఎందుకో
మత్తుమందుజల్లి నవ్వసాగే ఎందుకో

చరణం1
తళతళ మెరిసిన తారక తెలి వెలుగుల వెన్నెల దారుల
తళతళ మెరిసిన తారక తెలి వెలుగుల వెన్నెల దారుల
కోరి పిలిచెను తన దరి చేరగా
మది తలచెను తీయని కోరిక

చరణం2
మిలమిల వెలిగే నీటిలో చెలి కలువలరాణీ చూపులో
మిలమిల వెలిగే నీటిలో చెలి కలువలరాణీ చూపులో
సుమ దళములు పూచిన తోటలో
తొలి వలపుల తేనెలు దాగెను

చరణం3
విరిసిన హృఉదయమే వీణగా మధు రసములు కొసరిన వేళలా
విరిసిన హృఉదయమే వీణగా మధు రసములు కొసరిన వేళలా
తొలి పరువము లొసగెడు సోయగం
కని పరవశం అందెను మానసం

No comments: