Wednesday, December 6, 2006

ఆకాశదీపమ్

గదిలో ఎవరూ లేరు,
గది నిన్డా నిశ్శబ్దమ్.
సాయన్త్రమ్ ఆరున్నర,
గదిలోపల ఛినుకులవలె ఛీకట్లు.
ఖన్డపరశుగళ కపాలగణముల
ఛూస్తున్నది గది.

కనుకొలనులలో ఒకటివలె
ఛూపులేని ఛూపులతో తేరి
గదిలోపల ఎవేవో ఆవిరులు
దూరాన నిమ్గిమీద తోఛిన ఒక ఛుక్క
మిణుకుఛూపులు మెల్ల మెల్లగా విసిరి
గదిని తలపోతతో కౌగలిన్ఛుకొన్టున్నది
ఒక దురద్రుష్టజీవి
ఉదయమ్ ఆరున్నరకు
ఆ గదిలోనే ఆరిపోయాడు
అతని దీపమ్ ఆ గదిలో
మూలనక్కి మూలుగుతున్నది
ప్రమిదలో ఛమురు త్రాగుతూ
పలు దిక్కులు ఛూస్తున్నది
ఛీకటి బోనులో
సిమ్హములా నిలుఛున్నది
కత్తిగన్టు మీద
నెత్తుటి బొట్టులాగున్నది
ప్రమిదలొ నిలిఛి
పలిదిక్కులు ఛూస్తున్నది దీపమ్
అకస్మాత్తుగా ఆ దీపమ్
ఆకాశతారను ఛూసిన్ది
రాకాసి కేకలు వేసిన్ది.
(నీకు నాకు ఛెవుల సోకని కేకలు)
ఆకాశతార ఆదరపు ఛూపులు ఛాపిన్ది
అలిసిపోయిన్ది పాపమ్, దీపమ్.
ఆకాశతార ఆహ్వానగానమ్ ఛేసిన్ది
దీపమ్ ఆరిపోయిన్ది
తారగా మారిపోయిన్ది.

No comments: